- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇకపై నాన్ వెజ్ రహిత ప్రాంతంగా వారణాసి.. మున్సిపల్ అధికారుల కీలక నిర్ణయం
వారణాసి పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర పరిధిలోని మాసం, చేపల దుకాణాలను శివారులోని నిర్దేశిత ప్రదేశాలకు తరలించేలా వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: వారణాసి పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర పరిధిలోని మాసం, చేపల దుకాణాలను శివారులోని నిర్దేశిత ప్రదేశాలకు తరలించేలా వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం మేయర్ అశోక్ కుమార్ తివారీ అధ్యతన జరిగిన సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. సమావేశంలో పట్టణాభివృద్ధి, ఆక్రమణల తొలగింపుతో పాటు పరిశుభ్రతపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని మాంసం, చేపల మార్కెట్లను సైతం తరలించాలని నిర్నయించారు.
అంతే కాకుండా ఆరు నెలల్లో పట్టణం నుండి దుకాణాలను తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నగర పరిధిలో సుమారు 350 నుండి 400 వరకు మాసం, చేపల దుకాణాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. దుకాణాల నుండి వచ్చే వ్యర్థాల వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పారు. మరోవైపు పవిత్ర శ్రావణమాసంలో దుకాణాలు మూసివేయడం వల్ల వ్యాపారం కూడా దెబ్బ తింటుందని వ్యాపారులు చెప్పారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.






