- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబైలో కరెంట్ కష్టాలు.. కన్నీళ్లు పెడుతూ మహిళ వీడియో
దేశ ఆర్థిక, వాణిజ్య రాజధానిగా పిలిచే ముంబైలో కరెంట్ కష్టాలపై ఓ మహిళ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో విద్యుత్ సంక్షోభం ఉందని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ ఆర్థిక, వాణిజ్య రాజధానిగా పిలిచే ముంబైలో కరెంట్ కష్టాలపై ఓ మహిళ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో విద్యుత్ సంక్షోభం ఉందని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాను రాత్రి 11 గంటలకు పని నుండి ఇంటికి తిరిగి వచ్చి, ఉదయం 6గంటలకు మళ్లీ బయలుదేరుతానని చెప్పింది. ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే తెల్లవారుజామున 4-5 గంటల వరకు కరెంట్ లేకుండా గడపవలసి వస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది. వారం రోజులుగా నిరంతరం విద్యుత్ కోతలతో నిద్ర పోలేకపోతున్నానని చెప్పింది.
దాని వల్ల తన ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బ తింటోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది కేవలం తన బాధ మాత్రమే కాదని ఉల్వే, తలోజా ప్రాంతంలోని వేలాది మంది కరెంట్ లేక ఇబ్బందిపడుతున్నారని చెప్పింది. ప్రభుత్వం దయచేసి ఈ సమస్యను పట్టించుకోవాలని కోరింది. కరెంట్ లేక నిద్ర సరిగ్గా లేక తాను ఈ ట్రామా నుండి బయటకు రాలేకపోతున్నానని చెప్పింది. ప్రస్తుతం మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో స్థానికులు నిజమే అని ముంబైలో కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవాలని కోరుతున్నారు.






