రిషబ్ పంత్ కొట్టిన సిక్స్ డ్రోన్‌కు తగిలిందా? ఇదిగో వీడియో

by velandi.Saikiran |

రిషబ్ పంత్ కొట్టిన ఓ బంతి డ్రోన్‌కు తగిలిన‌ట్లు వీడియో వైర‌ల్ గా మారింది.

రిషబ్ పంత్ కొట్టిన సిక్స్ డ్రోన్‌కు తగిలిందా? ఇదిగో వీడియో
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత వికెట్ కీపర్ పంత్ కొట్టిన ఒక బంతి, డ్రోన్ కెమెరాను తగిలినట్లు ఓ వైరల్ అవుతోంది. బౌలర్ తల మీదుగా.. ఓ భారీ షార్ట్ ఆడాడు పంత్. ఈ క్రమంలో సిక్సర్ వెళ్లాల్సిన ఆ బంతి.. డ్రోన్ కు తగిలినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో ఆ డ్రోన్ తో పాటు బంతి కూడా అక్కడే పడిపోయాయి. ఈ క్రమంలో భారత్ ఆరు పరుగులు కోల్పోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ చేస్తున్నారు.

అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. అది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అంటూ నెటిజెన్స్‌ ఆధారాలు బయట పెడుతున్నారు. టెస్ట్ క్రికెట్ లో వైట్ బాల్ ఎలా వినియోగిస్తారు ? ఇదంతా ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆఫ్గనిస్తాన్, భారత జట్ల మధ్య టెస్ట్ కొనసాగుతోంది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 564 పరుగులు సాధించింది. ఇటు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్గనిస్తాన్ 113 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ఇప్పటి వరకు ఈ టెస్ట్ మ్యాచ్ లో రెండు రోజులు పూర్తయ్యాయి. మరో మూడు రోజుల ఆట మిగిలేవుంది.

Next Story