నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ..టైమింగ్స్ ఇవే

by velandi.Saikiran |   (  Updated:2026-06-07 21:45:30  IST  )

నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయ‌నున్నారు.

నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ..టైమింగ్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం నేటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగనుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు. చేప ప్రసాదం తీసుకునే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పను రాష్ట్రాల నుంచి వేలాది మంది హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మృగశిర కార్తె రోజున దశాబ్దాలుగా చేప ప్రసాదం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి లాగే ఈ సారి కూడా ఈ చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Next Story