మైదుకూరులో యువకుడి దారుణ హత్య

by Vemula.Srinu Prasad |

వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు ఇందిరమ్మ కాలనీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాగేంద్ర అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ముఖంపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది..

మైదుకూరులో యువకుడి దారుణ హత్య
X

దిశ, కడప టౌన్: వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు ఇందిరమ్మ కాలనీలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాగేంద్ర అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ముఖంపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడు ఆటో డ్రైవర్‌గా, కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడని, ఆలయ ఆవరణలో నిద్రించేవాడని స్థానికులు తెలిపారు. నాగేంద్రకు భార్య, కుమార్తె ఉన్నారని, కుటుంబ కలహాల కారణంగా అతని భార్య ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న మైదుకూరు అర్బన్ సీఐ రమణారెడ్డి, ఎస్‌ఐ చిరంజీవి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలు, నిందితుల ఆచూకీపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story