మణిపూర్ సంక్షోభం వెనుక సామాజిక, రాజకీయ కోణాలు ఉన్నాయి

by Taduka Kalyani |

మణిపూర్ సంక్షోభం కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ మాత్రమే కాదని, దాని వెనుక లోతైన సామాజిక, రాజకీయ కోణాలు ఉన్నాయని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

మణిపూర్ సంక్షోభం వెనుక సామాజిక, రాజకీయ కోణాలు ఉన్నాయి
X

దిశ,రాంనగర్ : మణిపూర్ సంక్షోభం కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ మాత్రమే కాదని, దాని వెనుక లోతైన సామాజిక, రాజకీయ కోణాలు ఉన్నాయని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మణిపూర్ సంక్షోభంపై కేవలం మౌనంగా ఉండిపోవడం సరికాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యతగా ముందుకు సాగాలని ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా ఉద్యమాల సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో రూపొందిన మణిపూర్ సంఘీభావం పేరుతో రూపొందించిన పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. పుస్తకాన్నిఆవిష్కరించిన అనంతరం ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో నెలకొన్నఅశాంతి, హింసాత్మక పరిస్థితులు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. అక్కడ నలిగిపోతున్న సామాన్య ప్రజలకు, బాధితులకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత సమాజంపై ఉందన్నారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా మేధావులు, సామాజిక శక్తులు గళం విప్పాలన్నారు. ఇలాంటి పుస్తకాలు ప్రజల్లో చైతన్యాన్ని, సంఫీుభావ భావాన్ని పెంపొందిస్తాయి అని ఆయన పేర్కొన్నారు. మణిపూర్ సంక్షోభం కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ మాత్రమే కాదని, దాని వెనుక లోతైన సామాజిక, రాజకీయ కోణాలు ఉన్నాయని విశ్లేషించారు. శాంతిభద్రతలను కాపాడటంలో, ప్రజాస్వామ్య విలువలను రక్షించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రజల హక్కుల కోసం, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అస్తిత్వ రక్షణ కోసం ఇలాంటి సంఫీుభావ వేదికలు మరిన్ని రావాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి వాస్తవాలను క్రోడీకరించి ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. శాంతిభద్రతలను కాపాడటంలో, ప్రజాస్వామ్య విలువలను రక్షించడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రజల హక్కుల కోసం, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అస్తిత్వ రక్షణ కోసం ఇలాంటి సంఫీుభావ వేదికలు మరిన్ని రావాలని పిలుపునిచ్చారు. పుస్తక సంపాదకులు హేమలలిత, వెంకట్రావ్ మాట్లాడుతూ మణిపూర్ లోని యదార్థ, పరిస్థితులను, అక్కడి ప్రజల ఆవేదనను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ పుస్తకాన్ని సంకలనం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఉద్యమాల సంఫీుభావ కమిటీ ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story