- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భరోసా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు
మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాల నివారణ, బాలల హక్కుల పరిరక్షణతో పాటు భరోసా సెంటర్ ద్వారా ప్రజలకు అందే సేవల గురించి ఆదివారం భరోసా సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి.

దిశ, నిజామాబాద్ అర్బన్ జూన్ 07: మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాల నివారణ, బాలల హక్కుల పరిరక్షణతో పాటు భరోసా సెంటర్ ద్వారా ప్రజలకు అందే సేవల గురించి ఆదివారం భరోసా సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. నిజామాబాద్ లోని భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ముగ్‌పాల్ మండలం సిర్పూర్ గ్రామంతో పాటు, నిజామాబాద్ నగరంలోని సీఎంఆర్ షాపింగ్ వద్ద కూడా పలు అంశాలపై ప్రజలకు పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. భరోసా సెంటర్ ద్వారా ప్రజలకు అందే సేవల గురించి ఈ కార్యక్రమంలో ప్రజలకు వివరించారు. పోక్సో చట్టం, సైబర్ భద్రత, ఆన్‌లైన్ వేధింపుల నివారణ, సోషల్ మీడియా ప్రయోజనాలు, వాటి దుష్ప్రయోజనాలు, లింగ వివక్ష వంటి అంశాలతో పాటు బాలలపై జరిగే అత్యాచారాల గురించి కూడా అవగాహన కల్పించారు. ప్రజలకు ఏదైనా అత్యవసర సహాయం అవసరమైతే 100, 1098 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని ప్రజలకు సూచించారు. సమాజంలో మహిళలు, పిల్లల భద్రత విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా భరోసా సెంటర్ ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూనే ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముగ్‌పాల్ ఏఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






