- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే కిషన్ రెడ్డి ఏం చేశారు? : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్లకి భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్లకి భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ నన్ను ఆపే ధైర్యం ఎవరికి లేదని కిషన్ రెడ్డి అంటున్నారని, మీరు పనులు చేస్తే మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు కిషన్ రెడ్డి అని నిలదీశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు రెండు సార్లు ఎంపీగా గెలిపించారని, కిషన్ రెడ్డి బీజేపీలో ఉంటారా లేదా అనే దానిపై తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని, ప్రజలు మీకు ఇచ్చిన అధికారంతో ఏం చేశారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. పదేళ్ళలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే కిషన్ రెడ్డి ఏం చేశారని, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేశారని ఆరోపించారు.
వరి ధాన్యం, మొక్క జొన్నలు కొనమని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి అడగడం తప్పు ఎలా అవుతుందని, ధాన్యం కొనుగోలుకు సహకరిస్తారా లేదా కిషన్ రెడ్డి చెప్పాలని ఎంపీ చామల నిలదీశారు. మెట్రో ఫెజ్ 2 కు, మూసీ ప్రక్షాళనకు కేంద్రం సహకారంపై కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కారని అంటున్న కిషన్ రెడ్డి జాతకాలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదని, కాళ్ళల్లో కట్టెలు పెట్టవద్దని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి అనడం తప్పా? తెలంగాణ ప్రజలు గమనించాలని ఎంపీ చామల అన్నారు.






