గట్ట కుస్తీ-2 సంగీత విన్యాసానికి సమయం ఆసన్నమైంది..

by Chukka Sudharani |

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘గట్ట కుస్తీ’ మొదటి సాంగ్ అప్డేట్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

గట్ట కుస్తీ-2 సంగీత విన్యాసానికి సమయం ఆసన్నమైంది..
X

దిశ, సినిమా: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘గట్ట కుస్తీ’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2022లో విడుదలై తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇదే జోష్‌తో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘గట్ట కుస్తీ-2’ రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ జులై 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతుండగా.. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ‘మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రోల్డన్ సంగీత విన్యాసానికి సమయం ఆసన్నమైంది.. గట్ట కుస్తీ -2 నుంచి మొదటి పాట ‘సంభవకారి’ జూన్ 9న రాబోతున్నది’ అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. కాగా.. చల్ల అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కరుణాస్, మునీష్కాంత్, కాళీ వెంకట్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ‘గట్ట కుస్తీ’ లాగే ఈ సీక్వెల్ కూడా అవుట్ అండ్ అవుట్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించబోతుంది అంటూ మేకర్స్ ప్రకటించగా అంచనాలు మరింత పెరిగాయి.

Next Story