విద్యార్థుల అ'పూర్వ' సమ్మేళనం

by Batti.Sumithra |

మూడున్నర దశాబ్ధాల పూర్వ విద్యార్థులు కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు.

విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
X

దిశ, నంగునూరు : మూడున్నర దశాబ్ధాల పూర్వ విద్యార్థులు కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందుకు వేదికైంది. 1989-90 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు.ఎస్ఎస్సీ పూర్తయిన 36 సంవత్సరాల తరువాత పూర్వ విద్యార్థులు చదువుకున్న పాఠశాలలో ఆదివారం కలుసుకున్నారు. తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆనందోత్సాహాల ఉత్సాహంగా గడిపారు. చాలాకాలం తర్వాత కలుసుకున్న విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. విద్యార్థి దశలో జరిగిన సంఘటనలు, గురువుల బోధనలు, పాఠశాల రోజుల్లోని మధుర అనుభూతులను స్మరించుకున్నారు. కొందరు విద్యార్థులు తమ వృత్తి, ఉద్యోగ, కుటుంబ జీవిత విశేషాలను పంచుకున్నారు. ఆత్మీయ వాతావరణంలో కొనసాగిన ఈ సమావేశంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎల్లంకి రామచంద్రా రెడ్డి, ఆనందయ్యలను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సహవిద్యార్థులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కాలం ఎంత మారినా పాఠశాల రోజుల స్నేహాలు, అనుబంధాలు ఎప్పటికీ చెరిగిపోవన్నారు. ఇలాంటి సమ్మేళనాలు పాత స్నేహాలను పునరుద్ధరిస్తాయన్నారు. పరస్పర సహకారం, అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జ్ఞాపికలు అందజేశారు. సామూహికంగా దిగిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందరూ కలిసి సామూహిక భోజనాలు చేసి ఆనందంగా గడిపారు. 36 సంవత్సరాల తర్వాత జరిగిన తమ ఆత్మీయ సమ్మేళనం తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి అయిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు గుండా వేణుగోపాల్, పూర్వ విద్యార్థులు గుగ్గిల రవి, దేవులపల్లి కనకయ్య, మల్యాల సత్యం, మల్యాల అశోక్, బండోజు శ్రీనివాస్, ఎండీ రహీం పాషా, ఎండీ బషీరుద్దీన్, ఇరుకుల్ల పోశెట్టి, వల్లపు రెడ్డి భాస్కర్ రెడ్డి, కరెడ్ల వెంకటరెడ్డి, జాగిరి జయరాములు, రాఘవరావు, తిరుమణి సాయిరాం, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సూరయ్య గౌడ్, వసంత, సరోజన, స్వరూప, యశోద, జయలక్ష్మి, రమాదేవి పలువురు మిత్రులు పాల్గొన్నారు.

Next Story