అగ్ని ప్రమాదంలో రైతుకు తీరని నష్టం

by Batti.Sumithra |

ప్రమాదవశాత్తు రైతు పొలంలో మంటలు చెలరేగి తీవ్ర నష్టం సంభవించిన ఘటన మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

అగ్ని ప్రమాదంలో రైతుకు తీరని నష్టం
X

దిశ, చిన్నకోడూరు : ప్రమాదవశాత్తు రైతు పొలంలో మంటలు చెలరేగి తీవ్ర నష్టం సంభవించిన ఘటన మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన గుడికందుల మధు తన ఐదు ఎకరాల వ్యవసాయ పొలంలో వరి కట్టలు కట్టి నిల్వ ఉంచాడు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పొలంలోని ఐదు ఎకరాల వరి కట్టలు, ట్రాక్టర్‌తో పాటు ఏడాది వయస్సు గల చిన్న దూడ కూడా అగ్నికి ఆహుతై మృతి చెందింది.

చుట్టుపక్కల రైతులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే వారు మంటలను ఆర్పేలోపే వరి కట్టలు, ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమై బూడిదయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో తనకు సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని రైతు బోరున విలపించాడు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ సురగొని శేఖర్ కోరారు.

Next Story