రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే గెలుపు: మహేష్ కుమార్ గౌడ్

by Ajay Maddhiboyina |

రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జలమండలి యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీ జెండా ఎగరడంపై మహేశ్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.

రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే గెలుపు: మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్: రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జలమండలి యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీ జెండా ఎగరడంపై మహేశ్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. 800 ఓట్ల భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా గెలిచిన రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కార్మికులకు ఉన్న నమ్మకానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ రెండున్న‌ర సంవ‌త్స‌రాల‌లో ఎన్నో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించామ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వంలో ఆర్టీసీ కార్మికులు రోజుల త‌ర‌బ‌డి స‌మ్మె చేసినా ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. కానీ మొన్న ఆర్టీసీ కార్మికులు స‌మ్మె చేస్తే మూడు రోజుల్లో పిలిచి స‌మ‌స్య‌ను ప‌రిష్కరించామ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వంలో కేసీఆర్ కుటుంబం నుండి సింగ‌రేణిని ఒక‌రు, జ‌ల‌మండ‌లిని ఒక‌రు త‌మ గుప్పిట్లో పెట్టుకున్నార‌ని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం పూర్తి ప్ర‌జాస్వామ్యాన్ని ఇచ్చింద‌ని చెప్పారు. ఈ ఎన్నిక‌లను కార్మిక‌మంత్రి గ‌డ్డం వినోద్ చొర‌వ చూపి ఎన్నిక స‌జావుగా జ‌రిగేలా చూశార‌ని అన్నారు.

Next Story