- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకలితో మరణిస్తున్న చిన్నారులు.. కానీ కండోమ్స్ సప్లయ్ చేసిన సంస్థ
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల వచ్చిన భూకంపం విధ్వంసం సృష్టించింది. దేశంలో అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా పరిగణించబడింది. వేలల్లో మరణాలు, లక్షల్లో గాయపడ్డ జనాలు.. ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులు అయ్యేందుకు కారణమైంది. రోడ్లు బీటలు వారడంతో చాలా గ్రామాలు కమ్యూనికేషన్‌కు దూరంగా ఒంటరిగా

దిశ, వెబ్ డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల వచ్చిన భూకంపం విధ్వంసం సృష్టించింది. దేశంలో అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా పరిగణించబడింది. వేలల్లో మరణాలు, లక్షల్లో గాయపడ్డ జనాలు.. ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులు అయ్యేందుకు కారణమైంది. రోడ్లు బీటలు వారడంతో చాలా గ్రామాలు కమ్యూనికేషన్‌కు దూరంగా ఒంటరిగా మారిపోయాయి. కేవలం హెలికాప్టర్ ద్వారా మాత్రమే చేరుకునే పరిస్థితి ఏర్పడింది. ఆకలితో మరణిస్తున్న చిన్నారుల దయనీయ దృశ్యాలు కంటతడి పెట్టించాయి. ఆహారం, నీరు, వైద్యం, గుడారాలు, దుప్పట్లు తక్షణ అవసరాలుగా మారగా.. మరోవైపు తాలిబన్ల ఆంక్షలు మహిళలను సహాయం పొందకుండా చేశాయి.
ఇంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుండగా.. ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు హెల్ప్ చేసేందుకు ముందుకొచ్చాయి. కానీ ఓ ఇంటర్నేషనల్ ఎన్జీఓ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. హెలికాప్టర్ ద్వారా కండోమ్స్ విసిరడం చర్చలకు దారితీసింది. ఇలాంటి పని చేయడాన్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. జనాలకు కండోమ్స్ కంటే ఆహారం, ఆశ్రయం అవసరమన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు నెటిజన్లు.






