- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nude Gang: నిన్నటి వరకు చెడ్డీ గ్యాంగ్.. ఇప్పుడు న్యూడ్ గ్యాంగ్!.. మహిళల కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ముఠా
వరుస దాడులతో నగ్న ముఠా మహిళలను బెంబేలెత్తిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మారుతున్న కాలంతో పాటు ఎక్కడి నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో అనే భయం ప్రజలను నిత్యం వెంటాడుతూనే ఉంది. కిడ్నాప్ ముఠాలు, దోపిడీ ముఠాలు ఇలా ఎవరి నుంచి ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో ఊహించడం కష్టంగా మారింది. ఇప్పటికే చెడ్డీ గ్యాంగ్ లు ప్రజలను హడలెత్తిస్తుండగా ఇప్పుడు తాజాగా తెరపైకి 'న్యూడ్ గ్యాంగ్' (Nude gang) వచ్చింది. గ్రామాల్లోని మహిళల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొందరు పురుషులు నగ్నంగా వచ్చి మహిళలను నిర్జన ప్రాంతాలకు ఈడ్చుకెళ్తున్నారు. దేశంలో తీవ్ర చర్చనీయాశంగా మారిన ఈ న్యూడ్ గ్యాంగ్ ప్రస్తుతం యూపీలో అలజడి సృష్టిస్తోంది. అకస్మాత్తుగా వచ్చి మహిళలను ఎత్తుకెళ్లే ప్రయయత్నాలు వరుసగా చేస్తున్న ఈ నగ్న ముఠాలను పట్టుకునేందుకు యూపీ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆఫీస్ కు వెళ్తుండగా దాడి:
ఇటీవల యూపీ మీరట్ లోని (Meerut) భారాలా (Bharaala village) గ్రామంలో ఆఫీసుకు వెళ్తున్న ఓ మహిళపై కొంత మంది పురుషులు వచ్చి ఆమెను పొలంలోకి లాకెళ్లే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ భయంతో బిగ్గరగా కేకలు వేయడంతో ఆమెను వదిలేసి పారిపోయారు. అక్కడికి చేరుకున్న స్థానికులు వారికోసం వెతికినా ఎవరు కనిపించలేదని గ్రామస్తులు చెప్పారు. అయితే ఆ ముఠాలోని వారెవరికి ఎటువంటి దుస్తువులు లేవని బాధిత మహిళ చెప్పడం అందరిని షాక్ కు గురి చేసింది. ఆ తర్వాత అదే గ్రామంలోని మరో ముగ్గురు మహిళలు ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నారని కానీ అవమాన భయంతో ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని స్థానికులు చెప్పడం కలకలం రేపుతోంది.
చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి:
దౌరాలా గ్రామానికి సమీపంలోని పలు గ్రామాల ప్రజలు కూడా తాము ఈ రకమైన నగ్న ముఠాలను చూశామని చెప్పడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో గ్రామ పెద్దలు పోలీసులను ఆశ్రయింంచగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ న్యూడ్ గ్యాంగ్ అంశంపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఎటువంటి అనుమానితులు లేకపోవడంతో ఈ పని చేస్తున్నదెవరు అనేది గుర్తించడం సమస్యగా మారింది. దీంతో ఈ గ్రామాలకు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో ఈ ముఠాలు ఏమైనా ఉన్నాయనా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు శనివారం డ్రోన్ ల సహాయంతో ఆ ప్రాంతాలను జల్లెడ పట్టారు. నిఘా కోసం సమీప ప్రాంతాల్లో కూడా సీసీటీవీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.
నగ్నముఠాల వల్ల చాలా మంది ఇళ్లు వదిలి బయటకు వచ్చేందుకు జంకుతుండగా మరి కొందరు ఇది ఒక పుకారు అని కొట్టివేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు దుండగులు ఈ ప్రయత్నం చేస్తున్నారని నమ్ముతున్నారు. ప్రసుత్తం ఈ వ్యవహారం యూపీలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటి విషయంలో తెలుగు రాష్ట్రాల్లోను పోలీసులు ఓ కన్నేసి ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
Read More : దేశంలో విపత్తు.. పిల్లలు ఆకలితో మరణిస్తుంటే.. కండోమ్స్ సప్లయ్ చేసిన ఎన్జీఓ






