కవల సోదరుడి కోసం గొప్ప త్యాగం.. IIT బాంబే సీటును వదులుకున్న ఒడిశా విద్యార్థి

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-03 15:06:48  IST  )

కవల సోదరుడిపై ఉన్న ప్రేమతో ఓ ఒడిశా విద్యార్థి ఏకంగా ఐఐటీ బాంబేలో వచ్చిన ప్రతిష్టాత్మక సీటును వదులుకున్నాడు.

కవల సోదరుడి కోసం గొప్ప త్యాగం.. IIT బాంబే సీటును వదులుకున్న ఒడిశా విద్యార్థి
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఓ అద్భుతమైన ఘటన ఒడిశా (Odisha)లో వెలుగుచూసింది. తన కవల సోదరుడితో కలిసి చదువుకోవాలనే ఒకే ఒక్క కారణంతో, ఓ విద్యార్థి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ బాంబే (IIT Bombay)లో వచ్చిన సీటును వదులుకుని, ఐఐటీ మద్రాస్‌లో చేరాడు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన కవల సోదరులు జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. అయితే, అందులో ఓ సోదరుడికి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్, టాప్ బ్రాంచ్‌లో సీటు వచ్చే అత్యుత్తమ ర్యాంక్ లభించింది. రెండో సోదరుడికి ఐఐటీ మద్రాస్ (IIT Madras)లో సీటు లభించింది.

సాధారణంగా ఐఐటీ బాంబేలో సీటు వస్తే లైఫ్ సెటిల్.. ఎవరూ వదులుకోరు. కానీ, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తన సోదరుడిని విడిచి ఉండలేక, ఆ విద్యార్థి ఐఐటీ బాంబే సీటును త్యాగం చేశాడు. తన సోదరుడు చదువుకోనున్న ఐఐటీ మద్రాస్‌లోనే తాను కూడా సీటును ఎంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒకే క్యాంపస్‌లో ఉంటూ, ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ విద్యార్థి తెలిపాడు. ఈ కవలల అనుబంధం, ఒకరి కోసం మరొకరు చేసుకున్న సర్దుబాటు, త్యాగాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు కీర్తిస్తున్నారు.

కాలేజీలోని స్టూడెంట్ యూనియన్ గదిలో నోట్ల కట్టల కలకలం.. చెదలు పట్టిన రూ.కోటి కరెన్సీ స్వాధీనం!

Next Story