ఫుట్ బాల్ ఆడిన జింక.. గోల్ కొట్టిన తర్వాత దాని సంతోషానికి హద్దులేవు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-06 06:02:37  IST  )

సాధారణంగా కోతులు, చింపాజీలు, పెంపుడు కుక్కలు వంటి జంతువులు మనుషులను అనుకరిస్తాయని మనకి తెలుసు.

ఫుట్ బాల్ ఆడిన జింక.. గోల్ కొట్టిన తర్వాత దాని సంతోషానికి హద్దులేవు!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా కోతులు, చింపాజీలు, పెంపుడు కుక్కలు వంటి జంతువులు మనుషులను అనుకరిస్తాయని మనకి తెలుసు. సోషల్ మీడియాలో (Social media) ఇందుకు సంబంధించిన వీడియోలు (Videos) కూడా అనేకం వైరల్ (Viral) అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఆటలు మనుషులు మాత్రమే ఆడుతారా? నేను కూడా ఆడుతా అనుకుందేమో ఓ జింక.. ఫుట్ బాల్ గ్రౌండ్‌లో సందడి చేసింది. అంతేకాదు అద్భుతంగా గోల్ కొట్టి ఆనందంతో గంతులేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది.

ఖాళీ మైదానంలోకి ప్రవేశించిన ఓ జింక పిల్లకు (Baby deer) ఫుట్ బాల్ (Foot ball) కనిపించింది. ఇంకేముంది, దానితో ఆట మొదలెట్టింది. తన కొమ్ములతో బంతిని తోసుకుంటూ వెళ్లి గోల్‌పోర్టులో (Goalport) వేసింది. ఇక గోల్ వేసిన తర్వాత ఆనందంతో ఎగురుతూ అక్కడే గంతులు వేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. 'సూపర్ గోల్' అంటూ కొందరు, 'జింక సెలబ్రేషన్​ బాగుంది' అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Click For Tweet..

Read More..

నెట్టింట సూపర్ వీడియో వైరల్.. పీతలు ఇంత క్యూట్‌గా తింటాయా?

Next Story