శృంగారానికి ఒప్పుకోలేదని ప్రియురాలిని చంపి.. అందరి ముందే అలా చేసిన ప్రియుడు

by  |
Lover Murdar
X

దిశ, వెబ్‌డెస్క్ : తను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని కొందరు యువకులు ఉన్మాదులుగా మారుతున్నారు. నడిరోడ్డుపై గొంతులు కోయడాలు, యాసిడ్ దాడులు చేయడం చేస్తూ సైకోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఇతడు. తాను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఆమెను వదల్లేదు. పెళ్లైనా తనతో సెక్స్ చేయాలని ఒత్తడి చేస్తూ.. హత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జలోర్ జిల్లాకు చెందిన శాంతిదేవికి గణేశ్ రామ్‌కు కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. స్నేహితులైన వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించినా ఇరు కుటుంబాల్లో అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడిపోయారు. శాంతిదేవికి మరో వ్యక్తితో వివాహం కావడంతో ఆమె భర్తతో కలిసి అహోర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తన్వాలా ప్రాంతంలో ఉంటుంది. ఆ దంపతులకు ఇద్దరు సంతానం కలిగారు. శాంతిదేవి భర్త ఉద్యోగరీత్యా మహారాష్ట్రలో ఉంటున్నాడు.

అయితే శాంతిదేవి ఒక్కతే ఉంటుందని తెలుసుకున్న మాజీ ప్రియుడు గణేశ్ రామ్‌ ఆమె పని చేసే ప్రాంతానికి వెళ్లాడు. ఇన్నాళ్లు తనతో ఎడబాటుగా ఉన్నావని, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు. నీకు పెళ్లైనా నాతో శృంగారంలో పాల్గొనాలని గొడవకు దిగాడు. దీనికి శాంతిదేవి ఒప్పుకోకపోవడంతో పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

అయితే నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నానంటూ అతడు ఆమె మృతదేహాన్ని హత్తుకుని అలాగే పడుకున్నాడు. స్థానికులు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని ఆమె నుంచి వేరు చేసి అదుపులోకి తీసుకుని, ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కాబోయే వధువు నగ్న ఫొటోలు చూసిన వరుడు.. కారుతోనే మత్తు మందు ఇచ్చి..!

Next Story