కాబోయే వధువు నగ్న ఫొటోలు చూసిన వరుడు.. కారులోనే మత్తు మందు ఇచ్చి..!

by  |

దిశ, వెబ్‌డెస్క్ : తనను పెళ్లాడబోయే యువతి ఇలా ఉండాలి.. అలా ఉండాలని యువకులు పెళ్లికి ముందే స్వప్న లోకాల్లో విహరిస్తుంటారు. తనకు నచ్చితే కట్నకానుకలు కూడా తీసుకోకుండా పెళ్లాడటానికి సిద్ధపడుతారు. అయితే ఈ యువకుడికి అలాంటి అమ్మాయే పెళ్లి చూపుల్లో కనిపించింది. తన కలల సుందరి దొరికిందని మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడు. వెంటనే పెళ్లికి ఓకే చెప్పేశాడు. ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. ఇదే సమయంలో యువకుడి మొబైల్‌కు వచ్చిన ఫొటోలు చూసి కాబోయే వధూవరులు ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఇంతకూ ఆ ఫొటోల్లో ఏముందంటే..

అస్సాం రాష్ట్రంలోని దిస్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురుని ఉన్నత చదువులు చదివించాడు.చదువులు పూర్తి అయ్యాక ఓ అబ్బాయిని చూసి పెళ్లి చూపులకు ఆహ్వానించాడు. అమ్మాయి మొదటి చూపులోనే నచ్చడంతో అబ్బాయి ఓకే చెప్పేశాడు. వెంటనే పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇదే సమయంలో యువతిని పెళ్లాడబోయే యువకుడి మొబైల్‌కు ఆ అమ్మాయి నగ్న ఫొటోలు వచ్చాయి. దీంతో షాక్ తిన్న యువకుడు విషయాన్ని కాబోయే అత్తమామల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఆ ఫొటోలను చూసిన యువతి సైతం షాక్‌కు గురైంది. వెంటనే అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌లో ఆమె కజిన్‌పై ఫిర్యాదు చేశారు.

ఇంతకూ ఆ ఫొటోలు ఎవరు తీశారంటే.. యువతి చదువుకుంటున్న రోజుల్లో ఆమె కాలేజీకి వెళ్తుండగా ఓ రోజు బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కజిన్ ఆమెను అతడి ఫ్రెండ్ కారులో డ్రాప్ చేస్తానని తీసుకెళ్లాడు. కారు ఎక్కిన తర్వాత కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. యువతి మత్తులోకి జారుకోవడంతో ఇద్దరు కలిసి అత్యాచారం చేశారు. అదే సమయంలో అత్యాచారం చేస్తూ ఫొటోలు తీశారు. ఆ నగ్న ఫొటోలనే ప్రస్తుతం వివాహం ఆడబోయే యువకుడికి పంపించారు. అని యువతి అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నది.

పూర్తిగా బట్టలు విప్పేయమంటూ వాట్సాప్‌లోనే 300 మందితో శృంగారం.. మూడ్‌లోకి వచ్చాక..

Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed