- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను చంపి రాత్రంతా శవం పక్కనే కూర్చొని 'పోర్న్ వీడియోలు చూసిన భార్య
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో సినిమా కథలను మించిన క్రైమ్ థ్రిల్లర్ (Crime thriller) వెలుగు చూసింది. కట్టుకున్న భర్త ప్రియుడితో కలిసి చంపడమే కాకుండా రాత్రి మొత్తం శవం పక్కనే కూర్చొని భార్య పోర్న్ వీడియోలు చూసింది.

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో సినిమా కథలను మించిన క్రైమ్ థ్రిల్లర్ (Crime thriller) వెలుగు చూసింది. కట్టుకున్న భర్త ప్రియుడితో కలిసి చంపడమే కాకుండా రాత్రి మొత్తం శవం పక్కనే కూర్చొని భార్య పోర్న్ వీడియోలు చూసింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దుగ్గిరాల కు చెందిన శివ నాగరాజు, లక్ష్మీ మాధురి భార్య భర్తలు. కాగా లక్ష్మీ మాధురి గత కొద్ది రోజులుగా గోపి అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో వారు శివనాగరాజును అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. తన భర్తకు ఇష్టమైన బిర్యానీలోనే 20 నిద్రమాత్రల పొడిని కలిపి వడ్డించింది. అతను స్పృహ కోల్పోగానే, ప్రియుడితో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. అనంతరం ఈ కిరాతకం అంతటితో ఆగలేదు.
భర్త శవం పక్కనే పడి ఉన్నా ఏమాత్రం చలించని ఆ మహిళ, రాత్రంతా ప్రియుడితో కలిసి పోర్న్ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసింది. మరుసటి రోజు ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించాడని చుట్టుపక్కల వారికి చెప్పింది. అంతా సజావుగానే సాగి పోతుందనుకున్న తరుణంలో, మృతుడి చెవి నుంచి వచ్చిన చిన్న రక్తపు చుక్క పోలీసులకు అనుమానం కలిగించింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఘోర రహస్యం బయటపడింది. తమకు అడ్డుగా ఉన్నాడనే హత్య చేసినట్లు ఒప్పుకుంది. అనంతరం పోలీసులు ఆమె ఫోన్ ను చెక్ చేయగా.. రాత్రి మొత్తం పోర్న్ వీడియోలు చూసినట్లు తేలింది. దీంతో పోలీస్ అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు.
Read More..
హైదరాబాద్‌లో దారుణం.. కూతురును చంపి ఆపై ఆత్మహత్యయత్నం చేసిన కుటుంబం






