- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో దారుణం.. కూతురును చంపి ఆపై ఆత్మహత్యయత్నం చేసిన కుటుంబం
హైదరాబాద్ జగద్గిరిగుట్ట అల్విన్ కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పుట్టుకతో వికలాంగురాలైన కూతురును చంపి ఆపై చేతులు కోసుకుని భార్య భర్తలు వారి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ జగద్గిరిగుట్ట అల్విన్ కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పుట్టుకతో వికలాంగురాలైన కూతురును చంపి ఆపై చేతులు కోసుకుని భార్య భర్తలు వారి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సతీష్ కుమార్ అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కాలనీలో నివసం ఉంటున్నాడు. కూతురు శ్రీ జావలి పుట్టుకతోనే వికలాంగురాలు కావడం, ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం మనస్థాపానికి గురైంది. మొదట కూతురును హత్య చేసి తరవాత కుటుంబ సభ్యులు చేతులు కోసుకున్నారు. అయితే 40 గంటలు దాటినా మరణించకపోవడంతో కుమారుడు నితిన్ తన స్నేహితుడు భాస్కర్ కు సమాచారం అందించాడు. దీంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకుని సహాయంతో రక్తపుమడుగులో ఉన్న ముగ్గురుని ఆస్పత్రికి తరలించారు. శ్రీ జావలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.






