రెండు పెళ్లిళ్లు.. ఖ‌రీదైన ఫోన్లు, కారు.. అఘోరీ అస‌లు పేరేంటి? ఆయన క‌థేంటి?

by Ajay kumar |   ( Updated:2025-04-17 16:35:50.0  )
రెండు పెళ్లిళ్లు.. ఖ‌రీదైన ఫోన్లు, కారు.. అఘోరీ అస‌లు పేరేంటి? ఆయన క‌థేంటి?
X

దిశ, వెబ్ డెస్క్: అఘోరీ నాగ‌సాధు.. ఇప్ప‌డు ఈ పేరు విన‌గానే గుర్తుకు వ‌చ్చేది అఘోరీ శ్రీనివాస్. గ‌త కొద్ది రోజులుగా అఘోరీ నాగ‌సాధువు అని చెప్పుకుంటూ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. నిజానికి శ్రీనివాస్ మంచిర్యాల జిల్లాలోని నెన్నెల అనే గ్రామంలో పుట్టిపెరిగాడు. తాను చిన్న‌య‌వ‌సులోనే హిమాల‌యాల‌కు వెళ్లి అఘోరీగా మారిన‌ట్టు శ్రీనివాస్ చెప్పుకుంటున్నాడు. కానీ శ్రీనివాస్ య‌వ్వ‌నంలో ఉన్న స‌మ‌యంలో సైలిష్ హెయిర్ కంటింగ్ తో దిగిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మ‌రోవైపు శ్రీనివాస్ ట్రాన్స్ జెండ‌ర్ కావ‌డం ప‌లు అనుమానాల‌కు దారి తీస్తోంది. శ్రీనివాస్ నిజంగా హిమాలయాలకు వెళ్లి ఉంటే ఎక్కడ ట్రాన్స్ జెండర్‌గా మారేందుకు అవసరమైన సర్జరీలు చేసుకున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

నిజానికి అఘోరీ నాగసాధులు ప్రజల్లో ఉండకుండా కేవలం కుంభమేళా సమయంలోనే బయటకు వస్తుంటారు. కానీ శ్రీనివాస్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చానని చెప్పుకుంటూ ఖరీదైన ఫోన్లు, సొంత కారుతో తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్నాడు. మత విద్వేశాలను రెచ్చగొట్టడంతో పాటూ పోలీసు అధికారులను సైతం ఇష్టం వచ్చినట్టు దూశిస్తున్నాడు. మొదట్లో శ్రీనివాస్ ను నిజంగానే అఘోరీ అని నమ్మినవారు సైతం ఇప్పుడు వ్యతిరేఖిస్తున్నారు. గ్రామాల్లో అయితే అతడు కనిపిస్తేనే దాడులు చేస్తున్నారు. సనాతన ధర్మం అనే ట్యాగ్ ను అడ్డుపెట్టుకుని శ్రీనివాస్ చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కాదు.. ఇటీవల శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచాడు. దీంతో వర్షిని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాయ మాటలు చెప్పి తమ కూతురును ఎత్తుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతలోనే అఘోరీ శ్రీనివాస్ తన భర్త అంటూ మరో మహిళ మీడియా ముందుకు వచ్చింది. అఘోరీగా మారకముందు శ్రీనివాస్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపింది. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని ఆ మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. తన వద్ద డబ్బులు తీకుని వేధింపులకు పాల్పడ్డాడని, చాలా మంది మహిళలను శ్రీనివాస్ ఇలానే మోసం చేశాడని ఆరోపించింది. ఇటీవలే ఓ ప్రొడ్యూసర్ సైతం అఘోరీ శ్రీనివాస్ పూజల పేరుతో తన వద్ద లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. తరచూ ఏదో ఒక ఇష్యూతో పోలీసులను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరోవైపు ట్రాన్స్ జెండర్లు సైతం శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని, అతడి వల్ల తమ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పడికైనా శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read More : లవర్స్‌కు గుడ్ న్యూస్.. జీవితానికే కాదు.. ఇకపై లవ్‌కు ఇన్సూరెన్స్



Next Story

Most Viewed