- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తే చూస్తూ ఊరుకోం.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి వార్నింగ్
జిల్లాల పునర్విభజన అంశం రాష్ట్రంలో పొలిటికల్‌గా సెగలు పుట్టిస్తోంది. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: జిల్లాల పునర్విభజన అంశం రాష్ట్రంలో పొలిటికల్‌గా సెగలు పుట్టిస్తోంది. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ మహబూబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయిన కేటీఆర్ (KTR) మళ్లీ గద్దెనెక్కుతామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. గత పాలకుల హయాంలో జిల్లాల విభజన ఏమాత్రం శాస్త్రీయంగా జరగలేదని పొంగులేటి విమర్శించారు. ఒకే నియోజకవర్గంలోని మండలాలు నాలుగు వేర్వేరు జిల్లాల్లో ఉండేలా అస్తవ్యస్తంగా విభజన చేశారని ఫైర్ అయ్యారు. కేవలం అదృష్ట సంఖ్యలు, రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పట్లో నిర్ణయాలు తీసుకున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంటే, కేటీఆర్‌కు ఎందుకు అంత భయం అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామంటూ కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికలే సెమీఫైనల్సా.. అయితే రా!
వచ్చే మున్సిపల్ ఎన్నికలను ‘సెమీఫైనల్స్’ (Semi Finals) అని కేటీఆర్ చెప్పడాన్ని మంత్రి పొంగులేటి స్వాగతించారు. మున్సిపల్ ఎన్నికల్లోనే ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామంటూ సవాలు విసిరారు. గత పంచాయతీ ఎన్నికల కంటే భారీ స్థాయిలో విజయం సాధించి, కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను తిరస్కరించారని, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి చావుదెబ్బ తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
READ MORE ....






