- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఈ డైవర్షన్ డ్రామాలు: కేటీఆర్
మహిళా ఐఏఎస్ పట్ల కథనం విషయంలో సిట్ ఏర్పాటుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం తరచూ చేసే అటెన్షన్ డైవర్షన్ డ్రామాలే విచారణల పేరిట కమిషన్‌లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముల (సిట్) ఏర్పాటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మహిళా ఐఏఎస్‌ను కించపరుస్తూ వార్తలను ప్రచారం, సీఎం రేవంత్‌రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారానికి సంబంధించిన కేసులపై డీజీపీ సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కారులో రాష్ట్ర మంత్రుల పీఏలు, మంత్రి కొడుకు, ఏఐసిసి సెక్రటరీపై ఆరోపణలు వస్తే వాటిపై ఎలాంటి సిట్లు లేవని కానీ, మీ అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా అధికార పక్షానికి దగ్గరగా ఉండే టీవీ చానెల్ రాష్ట్ర మంత్రి మీద వేసిన వార్తా కథనాన్ని కేవలం "ఉటంకించినందుకు" అనేక ఛానెళ్ల మీద, డిజిటల్ మీడియా హ్యాండిళ్ల మీద దర్యాప్తు చేయడానికి ఏకంగా సిట్ ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు.
కొత్త డ్రామాలు ఎందుకు?
వార్త వేసిన ఛానెల్ మీద చర్యలు తీసుకోక సిట్ పేరు మీద ఈ కొత్త డ్రామాలు ఎందుకు? ఎవరిని కాపాడటానికి? ఎవరిని వేటాడడానికి ఈ సిట్? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు మీ ఓవరాక్షన్ గమనిస్తున్నారని ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థల మీద ఈ వేధింపులు ఆపకపోతే మీకు తగిన గుణపాఠం చెప్పుడు ఖాయం అని హెచ్చరించారు.
READ MORE ....






