Kalvakuntla Taraka Rama Rao : కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం

by Ramesh Naini |   (  Updated:2026-01-13 13:05:46  IST  )

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR)కు అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం లభించింది.

Kalvakuntla Taraka Rama Rao : కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR)కు అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం లభించింది. మంత్రిగా ఆయన హయాంలో చేసిన అసాధారణ కృషి, తెలంగాణను ప్రపంచ పటంలో విశిష్టంగా నిలిపిన విధానాలను గుర్తిస్తూ, అంతర్జాతీయ వేదికపై తన ఆలోచనలను పంచుకోవాలంటూ ఆయనకు ఈ ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న కొలంబియా బిజినెస్ స్కూల్ (CBS)లో 2026 ఏప్రిల్‌ 4న జరగనున్న ‘21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌ (IBC)’లో ప్రసంగించేందుకు కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సదస్సును కొలంబియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి విభాగం ‘సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్‌ (SABA)’ నిర్వహిస్తోంది. భారతదేశ వ్యాపారం, ఆవిష్కరణలు, విధాన నిర్ణయ రంగాలపై మేధోమథనం జరిగే ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక వేదికలలో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ ఒకటిగా గుర్తింపు పొందింది. గత 21 ఏళ్లుగా న్యూయార్క్‌లో జరుగుతున్న ఈ సదస్సు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం పోషిస్తున్న పాత్రపై చర్చించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రవాస భారతీయులకు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తోంది.

ప్రధాన వక్తగా ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ వ్యవస్థాపకుడు

2026 కాన్ఫరెన్స్‌లో ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ‘జెరోధా’ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్ ప్రధాన వక్తగా పాల్గొననున్నారు. గతంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేశ్ అరోరా, డ్రీమ్‌11 సహ వ్యవస్థాపకుడు హర్ష్ జైన్ వంటి ప్రముఖులు ఈ వేదికపై ప్రసంగించారు. ఇటీవలే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరగనున్న ‘హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌’కు కేటీఆర్‌కు ఆహ్వానం అందిన నేపథ్యంలో, ఇప్పుడు కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి ఆహ్వానం రావడం విశేషంగా మారింది. ఇది ఆయన నాయకత్వం, విజన్‌ పట్ల అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా భావిస్తున్నారు. గత ఏడాది ఆక్స్‌ఫర్డ్ ఇండియా వీక్ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన కేటీఆర్‌, తన స్పష్టమైన, ముందుచూపుతో కూడిన ఆలోచనలతో అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకున్నారు. ఈసారి కూడా ఆయనను ‘విశిష్ట వక్త’గా ఆహ్వానించడం తమకు గౌరవంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజాసేవలో ఆయన చేసిన కృషి, భారతదేశ అభివృద్ధి పథంలో ఆయన పోషించిన పాత్రను వారు ప్రత్యేకంగా కొనియాడారు.

READ MORE ....

KTR: వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఈ డైవర్షన్ డ్రామాలు: కేటీఆర్

Next Story