- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"వెంటనే ఇరాన్ విడిచి రావాలని అమెరికా పౌరులకు వర్చువల్ ఎంబసీ హెచ్చరిక
ఇరాన్ లో ఆర్థిక మాంద్యం, కరెన్సీ విలువ పడిపోవడంతో ద్రవ్యోల్బనం భారీగా పెరిగిపోవడంతో ప్రజల జీవన ప్రశ్నార్థకంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ లో ఆర్థిక మాంద్యం, కరెన్సీ విలువ పడిపోవడంతో ద్రవ్యోల్బనం భారీగా పెరిగిపోవడంతో ప్రజల జీవన ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనలను అణిచివేసేందుకు ప్రభుత్వం సైనిక చర్యలను ప్రారంభించింది. దీంతో ఇరాన్ లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరాన్ లో ఉన్న తమ పౌరులను వెంటనే దేశం విడిచి రావాలని ఇరాన్‌లోని అమెరికా వర్చువల్ ఎంబసీ (Virtual Embassy) సంచలన హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయని, ఇవి హింసాత్మకంగా మారి అరెస్టులు, గాయాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే మొబైల్, ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిందని, రహదారుల మూసివేతతో ప్రజారవాణాకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోందని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయని, పరిమితం చేశాయని, కొన్ని విమానాలు జనవరి 16 (శుక్రవారం) వరకు నిలిచిపోతాయని ఎంబసీ తెలిపింది. ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉన్నందున, ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ మార్గాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఒకవేళ సురక్షితమని భావిస్తే, విమానాల కోసం వేచి చూడకుండా అర్మేనియా, టర్కీ (Türkiye) దేశాల మీదుగా రోడ్డు మార్గంలో ఇరాన్ నుంచి బయటపడాలని అమెరికా తన పౌరులకు సూచనలు జారీ చేసింది.
Read More..






