- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైరల్ వీడియో ఎఫెక్ట్.. అభద్రతా భావంలో కేరళ పురుషులు, అట్టా పెట్టెలకు భారీ డిమాండ్
కోజికోడ్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి, బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తనను అసభ్యంగా తాకాడని ఒక మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: కేరళలోని చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోజికోడ్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తి, బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తనను అసభ్యంగా తాకాడని ఒక మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 16న పయ్యన్నూర్ వెళ్లే బస్సులో ఈ ఘటన జరిగిందని సదరు మహిళ వీడియో పోస్ట్ చేయగా, అది లక్షలాది మందికి చేరింది. అయితే, ఆ ఆరోపణలు అబద్ధమని దీపక్ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరిగిన ఈ "డిజిటల్ ట్రయల్" కారణంగానే దీపక్ బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆగ్రహం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.
ఈ ఘటన అనంతరం కేరళలోని పురుషుల్లో తీవ్ర అభద్రతా భావం మొదలైంది. ఏ చిన్న పొరపాటు జరిగినా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే సంస్కృతి పెరిగిపోయిందని, పురుషులు బస్సుల్లో ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే కొందరు పురుషులు అట్టా పెట్టెలను (Cardboard boxes) తమ శరీరానికి కట్టుకుని బస్సుల్లో, బస్టాండ్లలో నిలబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఎవరికీ తాకకుండా ఉండేందుకు, ఏ ఆరోపణలు రాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నాం" అంటూ వ్యంగ్యంగా నిరసన తెలుపుతున్న ఈ దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం నిరసన మాత్రమే కాకుండా, పురుషుల భద్రత, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై జరుగుతున్న ఒక నిశిత విమర్శ గా కనిపిస్తోంది.






