కేరళలో వ్యక్తి మరణానికి కారణమైన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-20 07:11:19  IST  )

కేర‌ళ‌లో కోజికోడ్ బ‌స్సులో దీప‌క్ అనే వ్య‌క్తి అస‌భ్యంగా తాకాడ‌ని ఆరోపిస్తూ ఓ మ‌హిళ సోష‌ల్ మీడియాలో వీడియో పెట్ట‌డంతో అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగతి తెలిసిందే.

కేరళలో వ్యక్తి మరణానికి కారణమైన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు
X

దిశ‌, వెబ్ డెస్క్: కేర‌ళ‌లో కోజికోడ్ బ‌స్సులో దీప‌క్ అనే వ్య‌క్తి అస‌భ్యంగా తాకాడ‌ని ఆరోపిస్తూ ఓ మ‌హిళ సోష‌ల్ మీడియాలో వీడియో పెట్ట‌డంతో అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పోలీసులు ఆ మ‌హిళ‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. వీడియో వైర‌ల్ అవ్వ‌డం వ‌ల్ల‌నే అవ‌మాన భారంతో దీప‌క్ ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడంటూ అత‌డి కుటుంబ స‌భ్యులు, స్నేహితులు చెబుతున్నారు. వీడియోలోనూ దీప‌క్ ముందు నిల‌బ‌డ‌టం ఆ మ‌హిళ అత‌డి వెనుక ఉండ‌టంతో త‌నే కావాల‌ని వీడియో తీసింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నిజంగానే అస‌భ్యంగా తాకితే వెంట‌నే అత‌డిని నిందించాల్సింద‌ని, పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని అంటున్నారు. కానీ అలా చేయ‌కుండా అత‌డి ప‌క్క‌నే ఉండి సోష‌ల్ మీడియాలో వ్యూవ్స్ కోసమే వీడియో తీసి షేర్ చేసింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. పురుషులు మాత్ర‌మే కాకుండా మ‌హిళ‌లు సైతం ఆత్మ‌హత్య చేసుకుని చ‌నిపోయిన దీప‌క్ కే మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దీప‌క్ ను ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్పింద‌ని సద‌రు మ‌హిళ‌పై ఎఫ్ఐఆర్ న‌మోదైంది.

Read More... ప్రాణం తీసిన నిందారోపణ.. యువతి ఆరోపణలతో మనస్తాపం చెంది వ్యక్తి బలవన్మరణం

వైరల్ వీడియో ఎఫెక్ట్.. అభద్రతా భావంలో కేరళ పురుషులు, అట్టా పెట్టెలకు భారీ డిమాండ్

Next Story