ప్రాణం తీసిన నిందారోపణ.. యువతి ఆరోపణలతో మనస్తాపం చెంది వ్యక్తి బలవన్మరణం

by Malleboina Mahesh |   (  Updated:2026-01-20 06:30:04  IST  )

లైంగిక వేధింపులు అంటూ ఓ యువతి షేర్ చేసిన వీడియో.. వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. అవమానభారంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది.

ప్రాణం తీసిన నిందారోపణ.. యువతి ఆరోపణలతో మనస్తాపం చెంది వ్యక్తి బలవన్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: లైంగిక వేధింపులు అంటూ ఓ యువతి షేర్ చేసిన వీడియో.. వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. అవమానభారంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి తాను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఉద్దేశపూర్వకంగా తాకాడని ఆరోపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాసేపట్లోనే వైరల్ కావడంతో నెటిజన్లు ఆ యువకుడిపై విమర్శలు గుప్పించారు. అయితే, ఆ వీడియోలో జరిగిన ప్రచారం నిజం కాదని, తాను నిర్దోషినని మొత్తుకున్నా ఎవరూ వినకపోవడంతో దీపక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

అవమాన భారంతో కుంగిపోయిన దీపక్, తాను అలాంటి స్వభావం కలవాడిని కాదని, లోకం తనను తప్పుగా అర్థం చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో నిజా నిజాలు తెలుసుకోకుండా చేసే ఆరోపణలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయనేదానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన యువతిపై కూడా విచారణ జరిపే అవకాశం ఉంది.

Read More... కేరళలో వ్యక్తి మరణానికి కారణమైన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు

Next Story