- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగమాగం.. మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అమలు కాని హామీలపై విసిగిపోయి పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇవాళ నగరంలోని హరీశ్ రావు నివాసంలో సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పటాన్చెరువు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతి ద్వారా ప్రతినెలా నిధులు విడుదల చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదన్నారు. దీంతో మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, చెత్త ఎత్తడానికి కూడా నిధులు లేని దుస్థితి నెలకొందని కామెంట్ చేశారు.
ఇక నిధుల కొరతతో పట్టణాల్లో పారిశుధ్యం లోపించిందని.. దీంతో దోమల బెడద పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని హరీశ్ రావు అన్నారు. స్ట్రీట్ లైట్లు వెలిగే పరిస్థితి లేదని.. తాగునీటి సరఫరాలో కూడా కోతలు విధిస్తున్నారని తెలిపారు. ఇస్నాపూర్, గుమ్మడిదల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా చేతులెత్తేసిందని అన్నారు. మహిళలకు, యువతకు, రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారని దుయ్యబట్టారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం లేదని హరీశ్ రావు అన్నారు. దళిత బంధు, బీసీ బంధు పథకాలను పూర్తిగా పక్కన పెట్టారని.. పెన్షన్ల పంపిణీలో కూడా జాప్యం జరుగుతోందని తెలిపారు. పేదల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరుతో సహా అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
Read More..






