- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై బీఆర్ఎస్ నిరసన సభలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) విషయంలో అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) విషయంలో అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సభలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలపాలని పార్టీ భావించింది. అయితే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధం అయింది. దీంతో పార్టీ దృష్టిని పూర్తిగా ఎన్నికల ప్రచారంపై మళ్లించాలని కేసీఆర్ నిర్ణయించడంతో పాటు గెలుపు లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన సభలు ఎన్నికల ప్రచారానికి అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతోనే మూడు సభలను వాయిదా వేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
కృష్ణా జలాలపై పోరు.. ఎన్నికల తర్వాతే
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందని, 90 టీఎంసీల హక్కు ఉన్నచోట కేవలం 45 టీఎంసీలకే అంగీకరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దక్షిణ తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎండగట్టడానికి కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభలకు పార్టీ కార్యకర్తలు సిద్ధమైనప్పటికీ, ఇప్పుడు ప్రణాళిక మారింది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే, మళ్ళీ పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులను చైతన్యపరిచేలా సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఈలోపు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టాలని నేతలకు పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది.
Read More..






