బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారో హరీష్ రావు చెప్పాలి: మెట్టు సాయి కుమార్

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారో హరీష్ రావు చెప్పాలని, కవిత స్వయానా తన ఫోన్, తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారని, గతంలో చేసిన మోసాలు, పాపాలకు హారీష్ రావుకు శిక్ష తప్పదని రాష్ట్ర ఫిషరీస్​ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారో హరీష్ రావు చెప్పాలి: మెట్టు సాయి కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారో హరీష్ రావు చెప్పాలని, కవిత స్వయానా తన ఫోన్, తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారని, గతంలో చేసిన మోసాలు, పాపాలకు హారీష్ రావుకు శిక్ష తప్పదని రాష్ట్ర ఫిషరీస్​ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు. బుధవారం సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు ఆరు అడుగుల అబద్ధాల పుట్ట అని, కేసీఆర్ ఎందుకు తన ఫోన్ ట్యాప్ చేశారో హరీష్ రావు అడగాలని సాయి కుమార్ డిమాండ్ చేశారు.

కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ కలిసి హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారని, ఆయన రాజ ద్రోహానికి పాల్పడతారని భావించి కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ కలిసి ఆయనపై నమ్మకం లేక ఫోన్ ట్యాప్ చేయించారన్నారు. పోలీసు సిట్ విచారణలో ఆయన తన కొడుకు విదేశాలకు వెళ్తున్నారు పర్మిషన్ ఇవ్వాలని అడిగి బయటకు వచ్చి మోతేబరి మాటలు మాట్లాడుతున్నారని, అబద్దాలు మాట్లాడటంలో హరీష్​రావుకి ఆయనే సాటి అని, ఆయన లాంటి రాజకీయ నేతలు తెలంగాణలో ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని మెట్టు సాయి కుమార్ ధ్వజమెత్తారు.

Next Story