TVK Vijay : తమిళనాడు ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ

by Malleboina Mahesh |   (  Updated:2026-04-21 12:37:21  IST  )

TVK అధినేత విజయ్ తమిళ ప్రజలకు లేఖ రాస్తూ.. తాను ఏ శక్తులకు భయపడనని, ఏప్రిల్ 23న విజిల్ గుర్తుకు ఓటు వేసి చరిత్ర సృష్టించాలని కోరారు.

TVK Vijay  : తమిళనాడు ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం చివరి దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని కీలక పార్టీలు తమ సందేశాలను రాష్ట్ర ప్రజలకు ఓటర్లకు పంపుతున్నారు. ఈ క్రమంలోనే టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ రాశారు. అందులో "రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనపై వస్తున్న ఒత్తిళ్లు, అవరోధాలపై TVK అధినేత విజయ్ ఘాటుగా స్పందించారు. తనను ఎవరూ లొంగదీసుకోలేరని, ప్రజల సంక్షేమమే తన ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యర్థులపై విమర్శలు..

తమిళనాడుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న డీఎంకే (DMK), విధానపరమైన వైరుధ్యాలున్న బీజేపీ (BJP) వంటి శక్తులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విజయ్ ఆరోపించారు. ఫాసిస్టు మనస్తత్వం ఉన్న పార్టీలు లేదా బెదిరింపులకు పాల్పడే శక్తులకు తాను భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అధికారంతో భయపెట్టాలని చూసే వారికి తమిళ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

TVK ఒక అజేయ శక్తి

తన పార్టీ కేవలం ఒక రాజకీయ విభాగం మాత్రమే కాదని, అది సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని విజయ్ అభివర్ణించారు. "TVK అనేది అంతులేని సముద్రం.. ప్రజల గుండెల్లో వెలిగే నిజాయితీ గల నిప్పుకణిక" అని పేర్కొన్నారు. అవినీతి, విభజన శక్తులు తన పార్టీని ఓడించలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం డబ్బు పై ఆధారపడే రాజకీయ జూదగాళ్లను ప్రజలు పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు.

విజిల్ గుర్తుకే ఓటు వేయండి..

రాబోయే తరాల కలలను నిజం చేసేందుకు, విభజన శక్తులను ఏకాకిని చేసేందుకు ప్రజలంతా ఏకమవ్వాలని కోరారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వెళ్లి 'విజిల్' (Whistle) గుర్తుకు ఓటు వేయాలని విజయ్ అభ్యర్థించారు. రాజకీయ శక్తులు డబ్బు వర్షం కురిపించినా లోబడకుండా, మార్పు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Next Story