- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క పోస్ట్‌తో వివాదంలో చిక్కుకున్న బలగం వేణు.. క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్ల డిమాండ్
బలగం’ వంటి క్లాసిక్ హిట్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన దర్శకుడు వేణు యెల్దండి(Venu Yeldandi),

దిశ, సినిమా: బలగం’ వంటి క్లాసిక్ హిట్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన దర్శకుడు వేణు యెల్దండి(Venu Yeldandi), తన రెండో చిత్రం ‘ఎల్లమ్మ’(yellamma)తో ఫుల్ బిజీ అయిపోయారు. తెలంగాణ సంస్కృతి, భక్తి భావం కలగలిసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, ఇటీవల రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్శి’ అనే పవర్ ఫుల్ మాస్ రోల్‌లో పరిచయం చేస్తూ వేణు ఒక సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ పీరియడ్ డ్రామా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ చిత్రం షూటింగ్ లోకేషన్ నుంచి ఒక అప్‌డేట్ వచ్చి సోషల్ మీడియాను ఊపేస్తోంది. వేణు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి.
తెలంగాణలోని ఒక పురాతన ఆలయంలో షూటింగ్ జరుగుతున్నట్లు ఆ ఫోటోల్లో కనిపించగా, వేణు అక్కడ షూస్ ధరించి ఉండటం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. పవిత్రమైన ఆలయంలో షూస్ ధరించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని, ఆయన క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు వేణును విమర్శిస్తుండగా, మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. షూటింగ్ సమయంలో భారీ ఎలక్ట్రికల్ వైర్లు, లైటింగ్ పరికరాలు ఉంటాయని, రక్షణ కోసం, షాక్ తగలకుండా ఉండటానికి షూస్ ధరించడం సాధారణమేనని వారు వాదిస్తున్నారు. ఏదేమైనా, ‘బలగం’తో అందరినీ కలిపిన వేణు, ఇప్పుడు ‘ఎల్లమ్మ’ షూటింగ్ ఫోటోలతో వివాదంలో చిక్కుకోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Read More..
పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడంపై అనిల్ రావిపూడి రియాక్షన్ ఇదే..!






