పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడంపై అనిల్ రావిపూడి రియాక్షన్ ఇదే..!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-23 04:32:07  IST  )

మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల ప్రభంజనం సృష్టించాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi).

పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడంపై అనిల్ రావిపూడి రియాక్షన్ ఇదే..!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల ప్రభంజనం సృష్టించాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. సంక్రాంతి విజేతగా నిలిచిన ఆయన తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో అనిల్ ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారనే వార్త మెగా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచడమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈనేపథ్యంలో.. తాజాగా, అనిల్ రావిపూడి వైరల్ అవుతున్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది తన చిరకాల కోరిక అని, అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను పవన్(Pawan Kalyan) గారిని ఇంతవరకు కలవలేదు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సేవలో ఎంతో బిజీగా ఉన్నారు. కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనతో సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయంలో నాకూడా స్పష్టత లేదు’’ అని అనిల్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు కేవలం పుకార్లేనని, ప్రస్తుతం పవన్‌తో సినిమా చేసే ప్లాన్ ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే అది తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని, ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ ఖరారైతే తానే స్వయంగా ప్రకటిస్తానని అనిల్ రావిపూడి వెల్లడించారు. దీంతో పవన్-అనిల్ రావిపూడి కాంబోపై వస్తున్న వార్తలు చెక్ పడినట్లు అయింది.

Read More..

టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయడంపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్

Next Story