- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయడంపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు. గత ఏడాది ‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే కాకుండా, టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ప్రాంతీయ సినిమాగా నిలిచింది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి, తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఈ సక్సెస్ జోరులో ఉన్న అనిల్, తదుపరి తన 10వ చిత్రాన్ని కూడా 2027 సంక్రాంతి బరిలో నిలిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఒకవైపు విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్‌లో మల్టీస్టారర్ లేదా 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ వార్తలు వినిపిస్తుండగా, మరోవైపు అక్కినేని నాగార్జునతో క్రేజీ ప్రాజెక్ట్ చర్చలకు వస్తోంది. ముఖ్యంగా, కింగ్ నాగార్జునతో సినిమా చేయడం ద్వారా టాలీవుడ్ నలుగురు సీనియర్ లెజెండ్స్ (చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున)ను డైరెక్ట్ చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని అనిల్ భావిస్తున్నారు. నాగార్జున కోసం 'హలో బ్రదర్' తరహాలో అవుట్ అండ్ అవుట్ వింటేజ్ కామెడీ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు, అందులో ఒక ఐకానిక్ సాంగ్‌ను కూడా రీమిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈక్రమంలో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఒకవేళ కింగ్ నాగార్జున(Nagarjuna)తో సినిమా చేసే అవకాశం వస్తే, ఈ తరం నలుగురు లెజెండరీ సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసిన ఏకైక దర్శకుడిగా తన రికార్డు శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ‘హలో బ్రదర్’ వంటి క్లాసిక్ చిత్రంలోని వింటేజ్ నాగార్జున ఎనర్జీని, తనదైన మార్కు హై-వోల్టేజ్ కామెడీతో కలిపి వెండితెరపై మళ్లీ ఆవిష్కరించాలని ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More..






