విజయ్‌కు షాక్ ఇచ్చిన వీసీకే చీఫ్.. వాట్సాప్‌లో లేఖ పంపడంపై ఫైర్

by Malleboina Mahesh |   (  Updated:2026-05-08 10:24:54  IST  )

తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే మోకాలడ్డింది. మద్దతు కోసం వాట్సాప్‌లో లేఖ పంపడంపై ఆ పార్టీ నేత సెల్వన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విజయ్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

విజయ్‌కు షాక్ ఇచ్చిన వీసీకే చీఫ్.. వాట్సాప్‌లో లేఖ పంపడంపై ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. టీవీకే విజయ్ (TVK Vijay) సీఎం కావడం ఫిక్స్ అయినప్పటికి.. కావాల్సిన మద్దతుకు చిన్న పార్టీలు అత్యంత కీలకంగా మారాయి. ఈ క్రమంలో విజయ్ పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం విజయ్ కి కావాల్సిన మద్దతులో కీలకంగా మారిన వీసీకే పార్టీ (VCK party) చీఫ్.. విజయ్ పై ఫైర్ అయ్యాడు. విడతలై చిరుతైగల్ కట్చి (VCK) కి వాట్సాప్ ద్వారా లేఖ పంపడం వివాదానికి దారితీసింది.

దీనిపై వీసీకే జనరల్ సెక్రటరీ సెల్వన్ ట్విట్టర్ (X) వేదికగా ఘాటుగా స్పందించారు. "ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ వాట్సాప్‌లో లేఖ పంపుతారా? దాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి?" అని ఆయన ప్రశ్నించారు. కనీసం మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు అడగలేరా అని విజయ్ తీరును తప్పుబట్టారు. మెజారిటీకి అవసరమైన బలం లేని ఈ కీలక సమయంలో విజయ్ చాలా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

బీజేపీ కుట్రలపై హెచ్చరిక

తమిళనాడులోకి అడ్డదారిలో ప్రవేశించాలని చూస్తున్న బీజేపీ కుట్రలను అడ్డుకోవాల్సిన బాధ్యత సెక్యులర్ పార్టీలన్నింటిపై ఉందని సెల్వన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం డిజిటల్ మాధ్యమాల ద్వారా కాకుండా, ప్రత్యక్షంగా చర్చలు జరపాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించినప్పటికీ, వీసీకే వంటి పార్టీల మద్దతు లేకపోతే విజయ్ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన టీవీకే ముఖ్య నేతలు, వీసీకే అధినేత తిరుమావళవన్‌ను నేరుగా కలిసి చర్చలు జరిపే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

తమిళనాడులో కొత్త శకం: ‘దళపతి’ విజయ్‌కి ఎర్రజెండా మద్దతు

Next Story