- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో కొత్త శకం: ‘దళపతి’ విజయ్‌కి ఎర్రజెండా మద్దతు
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి వామపక్షాలు తమ అధికారిక మద్దతును ప్రకటించాయి.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి వామపక్షాలు తమ అధికారిక మద్దతును ప్రకటించాయి. సీపీఐ (CPI), సీపీఎం (CPM), వీసీకే పార్టీలు సంయుక్తంగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని స్పష్టం చేయడంతో తమిళనాట రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ కోసం ఎదురుచూస్తున్న విజయ్‌కు, వామపక్షాల నిర్ణయం కొండంత అండగా నిలిచింది. ఇప్పటికే టీవీకే (TVK) పార్టీకి కాంగ్రెస్ తన మద్దతును ప్రకటించగా, ఇప్పుడు వామపక్షాలు కూడా అదే బాటలో పయనించడం గమనార్హం.
ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం..
ఈ కీలక మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అవసరమైన బలం సమకూరినట్లయింది. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ద్రవిడ దిగ్గజాలను కాదని, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో విజయ్ సఫలమయ్యారు. "రాష్ట్ర సంక్షేమం, ప్రజల ఆకాంక్షల మేరకు ఒక సుస్థిర ప్రభుత్వాన్ని అందించేందుకు మేము టీవీకేకు సహకరిస్తున్నాం" అని వామపక్ష నేతలు తమ ప్రకటనలో పేర్కొన్నారు. వామపక్షాల మద్దతు లేఖలు అందడంతో, విజయ్ అతి త్వరలోనే లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరనున్నారు. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుండటంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.






