మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ఇరాన్ మిసైల్ సైట్లు, బోట్లపై అమెరికా దాడులు

by Malleboina Mahesh |   (  Updated:2026-05-26 05:27:15  IST  )

అమెరికా ఆత్మరక్షణ పేరుతో ఇరాన్ మిసైల్ సైట్లు, బోట్లపై దాడులు చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ఇరాన్ మిసైల్ సైట్లు, బోట్లపై అమెరికా దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ వాతావరణ నెలకొంది. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ (CENTCOM), దక్షిణ ఇరాన్‌ లోని కీలక లక్ష్యాలపై ముందస్తు వ్యూహాత్మక దాడులు నిర్వహించింది. ఇరాన్ దళాల నుండి తమ సైనికులకు ఎదురవుతున్న ముప్పు నుంచి రక్షించుకోవడానికి, 'సెల్ఫ్ డిఫెన్స్' (ఆత్మరక్షణ) లో భాగంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల్లో ప్రధానంగా ఇరాన్‌కు చెందిన మిసైల్ లాంచ్ సైట్లు (క్షిపణి కేంద్రాలు), సముద్రంలో మైన్లు (Mines) అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ సైనిక బోట్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లు యూఎస్ నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ను గౌరవిస్తూనే, తమ రక్షణ కోసం అత్యంత నిగ్రహంతో ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. బందర్ అబ్బాస్ పోర్ట్ నగర పరిసరాల్లో ఈ దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

BREAKING: ఇరాన్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు

Next Story