BREAKING: ఇరాన్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు

by velandi.Saikiran |   (  Updated:2026-05-26 05:28:07  IST  )

ఇరాన్ లోని పలు తీర ప్రాంత నగరాలలో భారీ పేలుళ్ల‌ శబ్దాలు వినిపించినట్లు వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ కీలక ప్రకటన చేసింది.

BREAKING: ఇరాన్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ కు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఇరాన్ దేశంలోని పలు తీర ప్రాంత నగరాలలో భారీ పేలుళ్ల‌ శబ్దాలు వినిపించినట్లు ఆ దేశ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని పోర్ట్ సిటీ బందర్ అబ్బాస్ తో పాటు సిరిక్ , జాస్క్ పట్టణాలలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్పష్టం చేసింది. అయితే దీనికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పే ప్రయత్నం చేసింది వార్తా సంస్థ ఫార్స్. ఇక అదే సమయంలో హార్ముజ్ జలసంధిలో ఇరాన్, అమెరికా నేవీ మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేర‌క వాస్త‌వం ఉందో తెలియాల్సి ఉంది.

మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ఇరాన్ మిసైల్ సైట్లు, బోట్లపై అమెరికా దాడులు

Next Story