ఇప్పటినుంచి మీకు నిజమైన సినిమా చూపిస్తాం.. వైసీపీకి కేంద్రమంత్రి పెమ్మసాని హెచ్చరిక

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-31 15:03:24  IST  )

ముఖ్యమంత్రి చంద్రబాబును అత్యంత అసభ్యంగా వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు దూషించడాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు.

ఇప్పటినుంచి మీకు నిజమైన సినిమా చూపిస్తాం.. వైసీపీకి కేంద్రమంత్రి పెమ్మసాని హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)ను అత్యంత అసభ్యంగా వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) దూషించడాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar) తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు బరితెగించి మాట్లాడారు. అత్యంత దుర్మార్గమైన భాషతో చంద్రబాబును కించపరిచారు. ఇప్పటివరకు సహనంతో భరించాం. ఇప్పటినుంచి నిజమైన సినిమా చూపిస్తాం. 24 గంటల్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. బరితెగించిన వారికి ట్రీట్‌మెంట్‌తో గుణపాఠం చెబుతాం. ఈ వ్యవహారంలో చట్టప్రకారమే ముందుకు వెళ్తాం’ అని పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. అంతకుముందు హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడితే ప్రజలను తిట్టినట్లే అన్నారు. అధికారంలో కోల్పోయేసరికి వైసీపీ నేతలంతా పిచ్చిపట్టినట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చూస్తూ ఊరుకోం అని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు.

MORE NEWS : తప్పు చేశావ్ అంబటి అన్న.. ఎమ్మెల్యే గల్లా మాధవి ఫైర్

Next Story