తప్పు చేశావ్ అంబటి అన్న.. ఎమ్మెల్యే గల్లా మాధవి ఫైర్

by Ramesh Naini |   (  Updated:2026-01-31 15:04:42  IST  )

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తప్పు చేశావ్ అంబటి అన్న.. ఎమ్మెల్యే గల్లా మాధవి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ గుంటూరు నవభారత్‌ నగర్‌లోని అంబటి ఇంటిని ముట్టడించి.. కారు, ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీగా మహిళా కార్యకర్తలు తరలి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. మీ ఇంటి కుక్క భయడకపోయినా.. నీవు భయపడాలని అంటూ అంబటిపై ఎమ్మెల్యే సెటైర్లు వేశారు. తప్పు చేశావ్ అంబటి అన్న అని మాధవి ఫైర్ అయ్యారు. దమ్ము, ధైర్యముంటే బయటకొచ్చి సీఎం చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పాలని మండిపడ్డారు.

MORE NEWS : ఇప్పటినుంచి మీకు నిజమైన సినిమా చూపిస్తాం.. వైసీపీకి కేంద్రమంత్రి పెమ్మసాని హెచ్చరిక

Next Story