కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం

by Malleboina Mahesh |   (  Updated:2026-01-22 05:27:02  IST  )

భారత పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఈ నెల జనవరి 27న ప్రారంభం కానున్నాయి.

కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు (Budget meetings) ఈ నెల జనవరి 27న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అనంతరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజూజి (Minister Kiren Rijiju) ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం (All-party meeting) జరగనుంది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో నిర్వహించనున్న ఈ భేటీకి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది.

రాబోయే బడ్జెట్ సెషన్‌లో ఉభయ సభల ముందుకు రానున్న కీలక బిల్లులు, శాసనసభ కార్యకలాపాలు, దేశాభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా బడ్జెట్ సమావేశాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కోరడమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే ఎజెండాను పార్టీలకు వివరించడంతో పాటు, ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం తమ సంసిద్ధతను వ్యక్తం చేయనుంది. దేశ ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తరుణంలో ఈ అఖిలపక్ష భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More..

APY: కేంద్ర కేబినెట్ శుభవార్త.. నెలకు రూ.5000 పెన్షన్ ఇచ్చే స్కీమ్‍పై కీలక నిర్ణయం

Next Story