TS EAMCET విద్యార్ధులకు అలర్ట్.. కొత్త షెడ్యూల్ విడుదల!

by Disha Web |
TSCHE Releases New Dates For EAMCET, ECET Entrance Exams
X

దిశ, వెబ్‌డెస్క్: TSCHE Releases New Dates For EAMCET, ECET Entrance Exams| ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన ఎంసెట్ అగ్రికల్చర్, ఈ సెట్ పరీక్ష తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం జులై 30,31 వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఆగస్టు 1న ఈ సెట్, ఆగస్టు 2 నుంచి 5 వ తేదీ వరకు టీఎస్ పీజీఈ సెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించబోతున్నారు. పరీక్షల షెడ్యూల్ లో మార్పును అభ్యర్థులు గమనించాలని హాల్ టికెట్ల కోసం సంబంధిత వెబ్ సైట్లను సందర్శించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ. ఆర్.లింబాద్రి పేర్కొన్నారు.

నిజానికి ఈ పరిక్షలు ఈ నెల 13, 14, 15 తేదీల్లో జ‌ర‌గాల్సి ఉండగా భారీ వర్షాలు, వరదల కారణంగా అధికారులు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త షెడ్యూల్ ను విడుదల చేశారు.ఆగస్ట్ 1న ఈసెట్ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్లు..



Next Story

Most Viewed