- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య సినిమాలో షాకింగ్ పాత్రలో ఐశ్వర్య రాజేష్?
బాలయ్య నెక్స్ట్ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ విలన్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఆమె హీరోయిన్‌గా కాకుండా పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఐశ్వర్య రాజేష్ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే స్టార్ హీరో సినిమా కోసం పూర్తిస్థాయి ప్రతినాయక పాత్రలో మాత్రం ఇప్పటివరకు కనిపించలేదు. బాలకృష్ణ వంటి మాస్ హీరో చిత్రంలో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తే, అది ఆమె కెరీర్‌లో పెద్ద మలుపుగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






