- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రక్తదానం మహాదానం.. యువత ముందుకు రావాలి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని గట్టు శ్రీరాములు గార్డెన్‌లో ఆయాన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా రక్తదాన శిబిరాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని గట్టు శ్రీరాములు గార్డెన్‌లో ఆయాన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా రక్తదాన శిబిరాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.."రక్తదానం మహాదానం. ఒక వ్యక్తి చేసిన రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదు" అని అన్నారు. యువత సామాజిక బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాల్లో పాల్గొని మరెందరికో ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన యువకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి, వారి సేవా భావాన్ని ప్రశంసించారు. సమాజానికి మేలు చేసే ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయాన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు, యువత, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.






