టీచర్ డుమ్మా.. స్కూల్ బంద్

by Batti.Sumithra |

మండలంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఉపాధ్యాయ నిర్లక్ష్యం. అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా ఓ చోట ఉపాధ్యాయులు రాక స్కూల్ బంద్ ఉండగా.. మరోచోట టీచర్ విద్యార్థులు కరువయ్యారు.

టీచర్ డుమ్మా.. స్కూల్ బంద్
X

దిశ, వాంకిడి : మండలంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఉపాధ్యాయ నిర్లక్ష్యం. అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా ఓ చోట ఉపాధ్యాయులు రాక స్కూల్ బంద్ ఉండగా.. మరోచోట టీచర్ విద్యార్థులు కరువయ్యారు. సోమవారం వాంకిడి మండలంలోని రెండు వేర్వేరు పాఠశాలలను సందర్శించగా లింబుగూడ గిరిజన ప్రాధమిక పాఠశాలలో ఉపాద్యాయుడు విధులకు హాజరు కాకపోవడంతో బడికి తాళం పడింది. ఉదయానే బడి వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు పాఠశాల తెరుచుకోవడంతో నిరాశతో వెనుదిరిగారు. తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు గిరి పిల్లల విద్యకు ఆటంకంగా మారుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంను ఫోన్ లో సంప్రదించగా లింబుగూడలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆదివారం పర్యటించిన నేపథ్యంలో సాయంత్రం వరకు ప్రొగ్రాంలో పాల్గొనడంతో టైడ్ అయి.. బాలింత మహిళ టీచర్ ఈ రోజు సెలవు పెట్టిందని చెప్పారు. నిజానికి ఓ టీచర్ సెలవు పై వెళ్తే అయిన స్థానం మరొకరిని డిప్యుటేషన్ పై నియమించాల్సి ఉంటుంది. కానీ సంబంధిత అధికారులు ఏవి ఏమి పట్టించుకోవడం లేదు. ఇక చిన్న వాంకిడి ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఓ టీచర్ కేవలం ముగ్గురు విద్యార్థులే చదువుకుంటున్నారు. గ్రామంలోని పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు పంపుతుండటంతో స్కూల్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. స్కూల్ లో మౌలిక సదుపాయాలు ఉన్న ప్రయోజనం కనిపించడం లేదు.. పాఠశాలలో విద్యార్థులు కరువయ్యారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయుల పోస్టులు ఉండగా ఒక మహిళ ఉపాధ్యాయురాలు డిప్యూటేషన్ పై వెళ్లడంతో ప్రస్తుతం ఒక టీచర్ విధులు నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story