- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదనపు బస్తి దావఖానాలను మంజూరు చేయండి: ఎమ్మెల్యే బండారి
ఉప్పల్ నియోజకవర్గంలో అదనపు బస్తి దావఖానాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.

దిశ , కాప్రా: ఉప్పల్ నియోజకవర్గంలో అదనపు బస్తి దావఖానాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ సంగీతను కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు, పలు రకాల వైద్య పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా బస్తీ దావకానాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే వినతిపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ సంగీత... అదనపు బస్తీ దవఖానాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వానికి నివేదికలను అందజేస్తానని పేర్కొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేసినట్లు తెలిపారు.






