టెహ్రాన్‌పై అమెరికా దాడి.. వీడియో విడుదల చేసిన ట్రంప్

by Muthe.Rajitha |   (  Updated:2026-04-05 09:26:17  IST  )

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సైనిక స్థావరంపై అమెరికా జరిపిన భారీ వైమానిక దాడికి సంబంధించిన వీడియోను ట్రంప్ విడుదల చేసారు.

టెహ్రాన్‌పై అమెరికా దాడి.. వీడియో విడుదల చేసిన ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. యుద్ధం మొదలై ఆరవ వారానికి చేరిన నేపథ్యంలో అమెరికా దాడులు మరింత ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని కీలక సైనిక స్థావరంపై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి దళాలు జరిపిన భారీ వైమానిక దాడికి సంబంధించిన వీడియోను ట్రంప్ విడుదల చేసారు. ఈ వీడియోతో పాటు ట్రంప్ రాసిన సందేశం మరింత ఉత్కంఠను రేపుతోంది: "అనాలోచితంగా, సరిగ్గా నడిపించలేని ఇరాన్ సైనిక నాయకులు చాలా మంది ఈ భారీ దాడిలో అంతమొందించబడ్డారు. ఇంకా ముందుంది!" అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వెంటనే చర్చలకు వచ్చి ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో మరిన్ని భయంకరమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ 48 గంటల గడువు విధించారు. కాగా ఈ దాడులను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

వీటిని అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన "హింసాత్మక యుద్ధ నేరాలు"గా అభివర్ణించింది. ఇరాన్ మీడియా కూడా తమ సైన్యం అమెరికా జెట్లను కూల్చివేసిన దృశ్యాలను విడుదల చేస్తూ, తాము కూడా దీటుగా సమాధానం ఇస్తామని ప్రకటించింది. టెహ్రాన్ వంటి జనసాంద్రత కలిగిన నగరంపై నేరుగా దాడులు జరగడం వల్ల పౌర ప్రాణనష్టంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

యుద్ధం ఎఫెక్ట్.. ఎగుమతిదారులకు కేంద్రం 'RELIEF

Next Story