యుద్ధం ఎఫెక్ట్.. ఎగుమతిదారులకు కేంద్రం 'RELIEF'

by Muthe.Rajitha |

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారత ఎగుమతులపై పడుతున్న ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.

యుద్ధం ఎఫెక్ట్.. ఎగుమతిదారులకు కేంద్రం RELIEF
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం (Operation Epic Fury) నేపథ్యంలో భారత ఎగుమతులపై పడుతున్న ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో ఏర్పడిన అడ్డంకుల వల్ల భారతీయ ఎగుమతిదారులను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం (Red Sea) వంటి కీలక మార్గాల్లో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో.., సరుకు రవాణా ఛార్జీలు (Freight Rates) భారీగా పెరిగాయి. దీనివల్ల గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ఉల్లిగడ్డలు వంటి నిత్యావసర వస్తువులతో పాటు ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ వస్తువుల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. త్వరగా పాడైపోయే ఆహార పదార్థాల (Perishable Goods) ఎగుమతిదారులు ఈ పరిస్థితుల వల్ల భారీ నష్టాలను చవిచూస్తున్నారు.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర వాణిజ్య శాఖ పలు కీలక చర్యలను చేపట్టింది. ఎగుమతిదారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రూ.497 కోట్ల భారీ రిలీఫ్ ( Resilience & Logistics Intervention for Export Facilitation) ప్యాకేజీని ప్రకటించింది. దీనితో పాటు, ఎగుమతి బాధ్యతల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించడంతోపాటు RODTEP వంటి రాయితీ రేట్లను పునరుద్ధరించడం ద్వారా ఎగుమతిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఎగుమతి నిలిచిపోయిన సరుకును ఇతర ప్రత్యామ్నాయ మార్కెట్లకు మళ్లించడంపై ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరీ ముఖ్యంగా, పాడైపోయే సరుకును సముద్ర మార్గంలో కాకుండా విమానాల ద్వారా తరలించేందుకు APEDA సంస్థ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యుద్ధం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగినప్పటికీ, ఎగుమతులు పూర్తిగా నిలిచిపోకుండా ప్రభుత్వం అన్ని రకాల మద్దతును అందిస్తోందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గారు స్పష్టం చేసారు.



Next Story