- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రాంగ్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారా?.. ఇలా తిరిగి పొందండి!
దిశ, ఫీచర్స్ : డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలను సులభతరం చేస్తాయి. కానీ ఈ సౌలభ్యంతో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. పొరపాటున ఇతరుల అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే ప్రమాదమూ ఉంది. మరి మీరెప్పుడైనా ట్రాన్స్‌ఫర్ లేదా పేమెంట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మీ డబ్బును రాంగ్ అకౌంట్(తప్పు ఖాతా)కు పంపారా? ఆ డబ్బును ఎలా తిరిగి పొందాలని ఆలోచిస్తున్నారా? ఈ కింది ప్రక్రియను అనుసరించి ఆ డబ్బును రికవరీ చేయొచ్చు.
భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ సర్వే ప్రకారం 2020 నుంచి దాదాపు 79 శాతం కుటుంబాలు పేటీఎమ్, ఫోన్‌పే వంటి థర్డ్-పార్టీ పేమెంట్ యాప్స్ ఉపయోగిస్తున్నాయి. వీరిలో 52 శాతం సెంట్రల్ బ్యాంక్ మద్దతునిచ్చే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) ప్లాట్‌ఫామ్ వాడుతున్నారు. ఈ క్రమంలోనే చాలాసార్లు పొరపాట్లు దొర్లుతున్నాయి. ఉదాహరణకు : 2022, జూన్ 29న ఒక ముంబై మహిళ రూ. 7 లక్షల మొత్తాన్ని ఆన్‌లైన్‌లో అపరిచితుల ఖాతాకు తప్పుగా బదిలీ చేసింది. ఆ తర్వాత సాయం కోసం బ్యాంక్‌ను సంప్రదిస్తే తమకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటంతో సైబర్ సెల్‌ను ఆశ్రయించింది. వారు ఆమె డబ్బు తిరిగి పొందేలా చర్యలు తీసుకున్నారు. 2022 జులై 2న ఆ పేమెంట్ రివర్స్ కావడం విశేషం. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ముందుగా పేమెంట్ రివర్స్ చేసేందుకు వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించాలి.
* బ్యాంక్ మేనేజర్ లేదా రిలేషన్‌షిప్ మేనేజర్‌కు కాల్ చేస్తున్నప్పుడు లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలను కలిగి ఉండాలి.
* బదిలీ చేసిన మొత్తం, బదిలీ సమయం, లబ్ధిదారుడితో పాటు చెల్లింపుచేసే వ్యక్తి ఖాతా వివరాలను అందించాలి.
* టెలిఫోనిక్ ఫిర్యాదుతో పాటు సమీపంలోని శాఖను సందర్శించి, సంఘటనను వివరించే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
* ఆ డబ్బును పొందిన లబ్ధిదారుడు మీ బ్యాంక్ ఖాతాదారునిగా ఉన్నట్లయితే ప్రక్రియ సులభతరం అవుతుంది.
* లేకుంటే మీ బ్యాంక్ తప్పుడు లబ్ధిదారుల బ్యాంక్‌ను సంప్రదించి రివర్సల్ ప్రక్రియ ప్రారంభిస్తుంది.
కోర్టును ఆశ్రయించాలి:
* గ్రహీత.. చెల్లింపును రివర్స్ చేసేందుకు నిరాకరిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు.
* రివరల్స్‌కు అంగీకరించని వ్యక్తుల నుంచి డబ్బు రికవరీ కోసం సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సివిల్ దావా వేసేందుకు సిద్ధంగా ఉండాలి.
* మనీ రికవరీ కోసం దావా దాఖలు చేసేందుకు రాంగ్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసిన తేదీ నుంచి మూడేళ్లపాటు కాలవ్యవధి ఉంటుంది.
డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాలి:
డిజిటల్ లావాదేవీల కోసం అంబుడ్స్‌మన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)చే నియమించిన సీనియర్ అధికారిని కూడా సంప్రదించవచ్చు. డిజిటల్ లావాదేవీల కోసం ప్రస్తుతం 21 మంది అంబుడ్స్‌మన్‌లను రాష్ట్ర రాజధానుల్లో నియమించారు.
* ఒక సాదా కాగితంపై వివరాలను రాసి, పోస్ట్/ఫ్యాక్స్/హ్యాండ్ డెలివరీ ద్వారా సంబంధిత అంబుడ్స్‌మన్ కార్యాలయానికి పంపడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
* డిజిటల్ లావాదేవీల కోసం ఇమెయిల్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చు.
* ఒకవేళ వైట్ పేపర్ ఉపయోగించకపోతే, ఫిర్యాదు ఫారమ్ కూడా RBI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
* ఈ ఫిర్యాదు చేసేందుకు ఎటువంటి రుసుము అవసరం లేదని గమనించాలి.